గుడిమల్కాపూర్ న్యూజెన్ స్కూల్ ప్రభంజనం
రాష్ట్రస్థాయి ర్యాంక్‌తో హైదరాబాద్‌లో నంబర్ వన్!
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని గుడిమ ల్కాపూర్ న్యూజెన్ స్కూల్ మరోసారి తన ప్రతిభను చాటుతూ పదవ తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలను సాధించింది. విద్యా రంగంలో ప్రతిష్టాత్మక స్థానాన్ని సంపాదించుకున్న ఈ పాఠశాల విద్యార్థులు ఈసారి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా హైదరాబాద్ జిల్లాలో ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
మొత్తం 600 మార్కులకు గాను విద్యార్థి సాత్విక్ 596 మార్కులు సాధించడం ద్వారా అసాధారణ ప్రతిభను ప్రద ర్శించాడు.ఈ ఘనతతో పాఠశాల పేరును రాష్ట్ర స్థాయికి చేర్చడమే కాకుండా, ఇతర విద్యార్థులకు కూడా ఆదర్శంగా నిలిచాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరస్పాండెంట్ కాపురి రవికుమార్ మాట్లాడుతూ,‘మా విద్యార్థులు కృషి, క్రమశిక్షణ, పట్టుదలతో సాధించిన ఈ విజయా లు మా పాఠశాల ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి’ అని గర్వంగా తెలిపారు.
ప్రిన్సిపాల్ కాపూరి శ్వేత మాట్లాడు తూ, సాత్విక్ వంటి ప్రతిభావంతులు మా పాఠశాల విద్యా ప్రమాణాలకు ప్రతిబింబం. ఈ ఫలితాలు ఉపాధ్యాయుల అంకితభావం, విద్యా ర్థుల శ్రమకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానిస్తూ అభినందనలు తెలియజేశారు. పాఠ శాల విద్యార్థుల కృషి, పట్టుదల, సమర్థ మార్గదర్శకత్వం వల్లే ఈ విజయం సాధ్యమైందని వారు పేర్కొన్నారు.






