18 July, 2026 | 12:02 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

30-05-2026 12:18 AM

గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్  ఎ. పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, మే 29 (విజయక్రాంతి): డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.  పావని వినయ్ కుమార్ అధికారులను కోరారు. డివిజన్ అభివృద్ధిలో భాగంగా గతంలో జిహెచ్‌ఎంసి  కార్పొరేటర్ నిధులు 1 కోటి రూపాయలతో చేపట్టిన రూ.9 లక్షల నిధులతో ప్రారంభించిన అరుంధతి నగర్ బస్తీ కమిటీ హాల్,  చిక్కడపల్లి బాపునగర్ బాపునగర్ యూత్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ రెన్నొవేషన్ పనులను శుక్రవారం గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ బీజేపీ నాయకులతో కలసి పనులను పరిశీలించారు.

కమ్యూనిటీ మరమ్మత్తుల పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరలో అందుబాటులోకి వచ్చే విధంగా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ.వినయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, ఎం. ఉమేష్, ఆనంద్ రావు, సాయి గౌడ్,  బస్తీ నాయకులు రాజు, రేవంత్, ఉదయ్, సాయి తేజ, క్రాంతి, భాగ్య, లావణ్య పాల్గొన్నారు.