18 July, 2026 | 12:22 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

తడిబట్టతో గొంతు కోసే కాంగ్రెస్

30-05-2026 12:19 AM
  1. అది రైతు వ్యతిరేక పార్టీ 
  2. మిల్లర్లతో కుమ్మక్కై అన్యాయం
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

సూర్యాపేట, మే 29 (విజయక్రాంతి): రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. తడబట్టతో గొంతు కోసే నైజం ఆ పార్టీ దని విమర్శించారు. సూర్యాటపేటలో శుక్రవారం నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ ప్రభుత్వంగా మారిపోయిందన్నారు.

ధాన్యం అమ్ముకునేందుకు రైతుల బాధలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు రైతుల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదన్నారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై తక్కువ ధరకే రైతులు అమ్ముకునేలా చేస్తున్నారని ఆరోపించారు. చివ రి గింజ వరకు మేమే కొంటాం అని చెప్పే మంత్రులు కేంద్రమే కొనుగోలు చేయాలి అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాదులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను కూడా వాడు కునే ప్రయత్నం చేస్తుందన్నారు.

బిజెపి ఎప్పుడు స్వార్థపూరిత రాజకీయాలు చేయదన్నారు. పాలనా సౌలభ్యం కోసమే తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర విభజనకు మద్దతు తెలిపిందన్నారు.  ఎన్టీఆర్ ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన పేరు ఎత్తే అర్హత కూడా ఆ పార్టీకి లేదన్నా రు. నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలన్నారు.