ట్రెండింగ్‌లో తస్సాదియ్యా సాంగ్
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న సెకండ్ ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 15న రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రీసెంట్‌గా ‘తస్సాదియ్యా’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. నెట్టింట ఎక్కడ చూసినా వైరల్ అవుతోంది.
ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో 20 వేలకు పైగా రీల్స్‌లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. అలాగే యూట్యూబ్, షార్ట్ వీడియోస్‌లోనూ సాంగ్ అందరినీ అలరిస్తూ ట్రెండ్ అవుతూ టాప్ రేంజ్‌లో దూసుకెళ్తోంది. రీసెంట్‌గా చిత్ర యూనిట్ సమంతను వెన్నెల కిషోర్ విడుదల చేసిన వీడియోకు సంబంధించిన క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.
దీంతో మా ఇంటి బంగారం మూవీపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. సమంత ఈ సినిమాలో కేవలం లీడ్ రోల్‌లో నటించటమే కాదు.. రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు.






