28 April, 2026 | 3:06 AM

ఆమె హ్యాండ్ ఇచ్చిన అమ్మయి.. నేను హ్యాండ్ పట్టుకున్న అమ్మయి..

28-04-2026 12:50 AM

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్‌బన్సల్ నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

* ఇందులో నేను ఒక మంచి క్యామియో రోల్ చేస్తున్నాను. నా పాత్ర పేరు శాలిని. తను ఒక వ్లాగర్. ఇందులో తరుణ్ గారితో ఒక రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. డైరెక్టర్ కశ్యప్ చాలా డిఫరెంట్‌గా రాశారు. ఆయన క్రియేట్ చేసిన యూనివర్స్, క్యారెక్టర్స్ అన్నీ చాలా హిలేరియస్‌గా వచ్చాయి.

* మల్టిపుల్ లేయర్స్‌లో జరిగే కథ ఇది. ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుంది. నా క్యారెక్టర్‌లో కామెడీ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యారెక్టర్ రైటింగ్ చాలా ఫన్నీగా ఉంది. సినిమా చూసిన ఆడియన్స్ కి మళ్లీ చూడాలని అనిపిస్తుంది. 

కథ విన్నప్పుడు నచ్చితే తప్పకుండా చేస్తాను. ఈ సినిమా కథ చాలా క్రేజీగా ఉంటుంది. వినగానే కొత్తగా అనిపించింది. ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

* ఇందులో శ్రీవిష్ణు క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

* మానస ఇందులో హ్యాండ్ ఇచ్చిన అమ్మాయి& నేను హ్యాండ్ పట్టుకున్న అమ్మాయి (నవ్వుతూ).

* తరుణ్, జేడీ, పవన్ ఇలా ఇందులో చాలా మంది దర్శకులు ఉన్నారు. వారితో కలిసి పనిచేయడం మంచి అనుభవం. ‘సత్య’ నుంచి ‘పెళ్లి చూపులు’ వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. జేడీ గారు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతారు. అందరూ కశ్యప్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో పనిచేశారు.

* నా దర్శకత్వంలో సినిమా గురించి నెక్స్ ఇయర్ ప్లాన్ చేస్తున్నా. కొన్ని కథలు రాస్తున్నా. ఇక నా నుంచి వచ్చే కొత్త సినిమాల గురించి చెప్పాలంటే.. ‘భగవంతుడు’ రాబోతోంది. అలాగే ‘సిగ్మా’ చేస్తున్నా. మరో రెండు సినిమాలు స్టార్ట్ అవబోతున్నాయి. సత్యదేవ్‌తో ఒక సినిమా చేస్తున్నా.