28 April, 2026 | 3:03 AM

కరను పెద్ద హిట్ చేయాలి

28-04-2026 12:44 AM

 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయిదుర్గతేజ్

ధనుష్, మమితా బైజు జంటగా డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్‌ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సాయి దుర్గతేజ్, బుచ్చిబాబుసానా, వెంకీఅట్లూరి ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో ధనుష్ మాట్లాడుతూ .. “కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ.

విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేశ్‌రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇకముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి. ‘పోరు తొళిల్’ చూసిన తరువాత విఘ్నేశ్ ఎనర్జీ నన్ను టచ్ చేసినట్టు అనిపించింది. అందుకే ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ మూవీకి సపోర్ట్ చేసిన గణేష్ గారికి థాంక్స్. మమిత అద్భుతమైన నటి. రవికుమార్ సార్‌తో పనిచేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది.

నా ఫ్రెండ్ జీవీ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తుంటారు. ‘కుబేర’, ‘ఇడ్లీకొట్టు’ తరువాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తు న్నాను. ‘కర’ ఎంతో క్వాలిటీతో రాబోతోంది. మా కోసం వచ్చిన సాయిదుర్గతేజ్ గారికి, వెంకీ అట్లూరి, బుచ్చిబాబు గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా సినిమా రాబోతోంది. థియేటర్లో మా సిని మా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. సాయిదుర్గతేజ్ మాట్లాడుతూ.. ‘వేల్స్ తరుఫున గణేష్ గారు చేసే సేవా కార్యక్రమాల గురించి నాకు తెలుసు.

విఘ్నేశ్‌గారు తీసిన ‘పోరు తొళిల్’ అంటే నాకు చాలా ఇష్టం. జీవీ ప్రకాష్ గారి మ్యూజిక్ నాకు ఇష్టం. మమిత గారి వర్కింగ్ నాకు ఇష్టం. నా జీవితంలోని ప్రేమ కథలకు ధనుష్ గారి లవ్ సాంగ్స్‌కి చాలా కనెక్షన్ ఉంది. ‘3’, ‘ఆడుకాలం’ ఇలా ప్రతీ సినిమా, అందులోని పాటలు నా మీద ప్రభావం చూపించాయి. ధనుష్ గారి ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి. ‘రఘువరన్ బీటెక్’లో ఇచ్చే ఆ చిన్న స్మైల్ ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కేఎస్ రవి కుమార్ గారి మేకింగ్, యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం.

సతీష్, రాజేష్ గారికి ఈ మూవీతో లాభాలు రావాలి. ఏప్రిల్ 30న ‘కర’ రాబోతోం ది. తెలుగు ప్రేక్షకులందరూ వీక్షించి పెద్ద హిట్ చేయండి’ అని అన్నారు. మమిత బైజు మాట్లాడుతూ .. ‘తెలుగు ప్రేక్షకులు నాపై కురిపిస్తున్న ప్రేమకు థాంక్స్. ‘కర’ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ మూవీ నాకెంతో నేర్పింది. నాకు సపోర్ట్‌చేసిన ధనుష్ గారికి థాంక్స్. నాపై నమ్మకంతో నాకు ఈ పాత్రను ఇచ్చిన విఘ్నేశ్ గారికి థాంక్స్.

మా అందరినీ సపోర్ట్ చేసిన వేల్స్ ప్రొడక్షన్ కంపెనీకి థాంక్స్. మా కోసం వచ్చిన మా డైరెక్టర్ వెంకీ గారికి, మా కోసం వచ్చిన సాయిదుర్గతేజ్ గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా ‘కర’ రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు విఘ్నేశ్ రాజా, నిర్మాతలు డా. ఐషరి కె. గణేష్, కుష్మిత గణేష్, విఘ్నే శ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత సతీష్ కుమార్, కేఎస్ రవి కుమార్ తదితరులు మాట్లాడారు.