17 June, 2026 | 11:30 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

‘రిస్క్’ టీజర్ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం

20-08-2024 01:22 AM

ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘6 టీన్స్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘రిస్క్-: ఏ గేమ్ అఫ్ యూత్’. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ (జీకే) స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. రాజీవ్ కనకాల, అనీష్ కురువిళ్ల ఈ చిత్రంలో ప్రత్యేక నటనా శైలి ప్రదర్శించనున్నారు. సందీప్ అశ్వా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సన్య ఠాకూర్, జోయా ఝవేరి హీరోయిన్స్ కాగా.. తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్, విశ్వేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

చిత్రబృందం తాజాగా సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా టీజర్ విడుదల చేయించగా.. కార్యక్రమంలో నిర్మాత బండ్ల గణేశ్, గడ్డం రవి, భవిష్ ఘంటాడి, చిత్రబృందం పాల్గొన్నారు. ఈ సినిమాకు నిర్మాత, రచన, సంగీతం, దర్శకత్వం: జీకే; డీవోపీ: జగదీశ్ కొమరి; పాటలు: సుద్దాల అశోక్‌తేజ, వరికుప్పల యాదగిరి, జీకే; స్టంట్స్: శేఖర్ మాస్టర్.