టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, జూన్ 1 (విజయక్రాంతి): సోమవారం, 2026-27 విద్యా సంవత్సరానికి గాను రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలల్లో కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ కొనుగోలు సేకరణ టెండర్ల ప్రక్రియపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా కొనుగోలు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టెండర్ నిబంధనలు, అర్హత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం, నాణ్యత ప్రమాణాలు, ఈఎండీ ఇతర సాంకేతిక అంశాలను కమిటీ సభ్యులతో సమగ్రంగా సమీక్షించారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నెల 12 లోపు ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ రావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, డీసీఎస్‌ఓ సురేష్ రెడ్డి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సల్మా యాస్మిన్, సీఎస్సీ డీఎం యాకుబ్ పాషా, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






