09-01-2026 01:04:15 AM
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరుదైన ఘనత
మణికొండ, జనవరి 8, (విజయక్రాంతి): సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే ఆకాశమే హద్దని నిరూపించారు నార్సింగికి చెందిన పలమడ హితేష్. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కొనసాగుతూనే పర్వతారోహణపై ఉన్న మక్కువతో ప్రపంచంలోనే నాలుగో అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ కిలిమంజారోను విజయవంతంగా అధిరోహించారు. మాజీ వైమానిక దళ ఉద్యోగి పలమడ రమణ కుమారుడైన హితేష్ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన దేశభక్తి, క్రమశిక్షణతో ఈ సాహసానికి పూనుకున్నారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఆఫ్రికా ఖండంలోని అత్యున్నత శిఖరంపై అడుగుపెట్టి భారత జాతీయ పతాకాన్ని సగౌరవంగా ఎగురవేసి దేశ ఖ్యాతిని చాటారు.