ఫాసిజం అంతమొందించడమే సుందరయ్యకు నిజమైన నివాళి
- సుందరయ్య జీవితం ఆదర్శం
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య
మణుగూరు, మే 19 (విజయ క్రాంతి )నేడు దేశంలో వేరుకు పోతున్న ఫాసిజం ను అంత మన్నించడమే పుచ్చలపల్లి సుందరయ్య కు మనం ఇచ్చే నిజమైన నివాళని, సుందరయ్య జీవితం దేశంలో అన్ని వర్గాల వారికి ఆదర్శమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు. సోమవారం స్థానిక శ్రామిక భవనం లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా అరుణ పతాకాన్ని ఎగురవేశారు.
అనంతరం సుందరయ్య చిత్రపటానికి సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు. పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. మడి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుందరయ్య జీవిత చరిత్ర నేటి యువతరానికి,సబ్బండ వర్గాలకు ఆదర్శ అన్నారు. సమాజంలోని కుల వ్యవస్థ అంటరానితనం చూసి చలించిపోయారన్నారు.
అసమానతలు లేని అంతరాలు లేని సమాజం కోసం ఆయన విశేష కృషి చేశారని, ఆయన జీవితం అనేక త్యాగాలతో నిర్మితమైందన్నారు. నేడు నిజం అరుదైన విషయంగా మారిపోయింది, అబద్ధం అభివృద్ధి ముసుగేసుకుని ఆధునికతగా చలామనవుతుందన్నారు. నేడు ప్రపంచీకరణ పేరుతో జరిగే ఆర్థిక వలసవాదం దేశాన్ని కబళిస్తున్న వేళ సుందరయ్య లాంటి నేతలు అవసరం అన్నారు.
బహుళ జాతి కంపెనీలు, రైతుల భూములను ఆక్రమించినప్పుడు విదేశీ పెట్టుబడును కార్మిక శక్తిని చరబడుతున్నప్పుడు, ఆర్థిక శాసనాల పేరిట మానవ హక్కులు తుడచి పెడుతున్నప్పుడు ఆయన జీవితం ఎనలేని బలం ఇస్తుందన్నారు. ఎదురు తిరిగే తెగవనిస్తుందన్నారు. ప్రపంచీకరణలో నలిగిపోతున్న స్థానిక జీవన విధానాలకు మతోన్మాదంలో మగ్గిపోతున్న సామాజిక చైతన్యానికి దారి చూపాడన్నారు.
ఓ ప్రత్యామ్నాయ విప్లవ శాస్త్రంగా స్ఫూర్తినిస్తాడన్నారు. సత్యం కోసం జీవితాన్ని ధారపోసిన విశ్వ మానవ పతాకం అవుతాడన్నారు. ఈ కార్యక్రమాలు సిపిఎం మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివరావు, కొడిశాల రాములు , సీనియర్ నాయకులు మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల్ల వెంకన్న, పిట్టల నాగమణి, కొండ్రు గౌరీ కుంజా రాజు, ఖతిజ బేగం, సున్నం మల్లేష్, కోటయ్య, ఎస్ వెంకట్రావు. తదితరులు పాల్గొన్నారు.
వైరా, మే 19 (విజయక్రాంతి) భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట రథ సారధి పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నా యకులు పి.సొమయ్య అన్నారు. సోమవారం సిపిఐ(ఎం) వై రా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బోడెపూడి భవనంలో పార్టీ పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన కా మ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమం జరిగింది..
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం వరకు, అలాగే పార్లమెంట్లో ప్రజా ప్రతినిధిగా ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక సూచనలు, సలహా లు, నెహ్రూ ప్రభుత్వానికి ఇచ్చిన గొప్ప మేధావి సుందరయ్య అన్నారు. దేశంలో, ప్రజల్లో అసమానతలు తొలగి పోవాలని తన కుటుంబ నుంచే ప్రారంభించిన గొప్ప ఆదర్శ కమ్యూనిస్టుగా సుందరయ్య నిలిచారన్నారు..
వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు నిర్వహించటం ప్రధాన కర్తవ్యంగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు పి లుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేరుగు సత్యనారాయణ, సుంకర సుధాకర్, పార్టీ రూరల్ మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరావు,
పార్టీ సీనియర్ నాయకులు పా రుపల్లి చంద్రశేఖర్ బాబు, పట్టణ నాయకులు బొంతు సమ త, గుడిమెట్ల రజిత, కొంగర సుధాకర్, పైడిపల్లి సాంబశివరా వు, గుడిమెట్ల మోహన్ రావు, గుమ్మా నరసింహారావు, రాచబంటి భత్తిరన్న, తోట కృష్ణవేణి, షేక్. నాగుల్ పాషా, కంసాని మల్లికాంబ, పాపగంటి రాంబాబు, యనమద్ది రామకృష్ణ, ఒ ర్సు సీతారాములు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
-సిపిఎం చర్ల మండల కమిటీ
చర్ల, మే 19 (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమసమాజ స్థాపనకు అనునిత్యం పాటుపడి నిరుపేదల అభ్యుదయానికి కృషి చేసిన వ్యక్తి పుచ్చలపల్లి సుం దరయ్య అని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు చింతూరి వెంకట్రావు అన్నారు. సోమవారం మండల కేంద్ర లో బిఎస్ రామయ్య భవనంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సభలో చిం తూరి వెంకట్రావు మాట్లాడుతూ సుందరయ్య సమ సమాజ స్థాపన కోసం . అనునిత్యం నిరుపేదల పక్షాన బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండి. భూస్వాములకు పెత్తందారులకు ఎదురు తిరిగి ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన గొప్ప సిద్ధాంతకర్త అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమి టీ సభ్యురాలు పొడుపు గంటి సమ్మక్క,ఊడుగుల సారోను, వరదల వరలక్ష్మి ,శ్యామల వెంకటేశ్వర్లు, శ్యామల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.






