calender_icon.png 20 May, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

20-05-2025 12:56:23 AM

జగిత్యాల, మే 19 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని విద్యానగర్ శ్రీరాజరాజేశ్వర ఉన్నత పాఠశాల 1995-96 పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం పట్టణంలోని సంగీత కన్వెన్షన్ హాల్లో ఆనందంగా జరుగింది.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వారికి విద్యా బుద్దులు నేర్పిన ఉపాధ్యాయులతో ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. విద్యార్థులను గొప్పవారుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు చూపించిన శ్రద్ధ, నేర్పిన క్రమశిక్షణ అంశాలపై మా ట్లాడుకున్నారు.

అనంతరం విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించుకున్నారు. ఈ అపూర్వ సమ్మేళనంలో పాఠశాల కరస్పాండెంట్ తిరు పతిరావు, ఉపాధ్యాయులు మహేష్, ప్రకాష్, శ్రీనివాస్, సీతారాం, రవీందర్, అలీలతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.