calender_icon.png 1 February, 2026 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే కేంద్ర బడ్జెట్

01-02-2026 02:14:05 AM

  1. వృద్ధి మంత్రం.. పొదుపు సూత్రం
  2. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
  3. రక్షణ, మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయంపై దృష్టి  
  4. అభివృద్ధికి ఊతమిస్తూనే ఆర్థిక క్రమశిక్షణ  
  5. వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ఆర్థికమంత్రిగా రికార్డ్

న్యూఢిల్లీ, జనవరి 31 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (ఫిబ్రవరి 1న)ఉదయం 11గంటలకు పార్లమెంటులో 2026--27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌లో వృద్ధి వేగాన్ని కొన సాగిస్తూనే, సంక్షేమ పథకాలకు, ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటిం చనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నా రు. ముఖ్యంగా రక్షణ, మౌలిక సదుపాయా లు, మూలధన వ్యయం, విద్యుత్, అందుబా టు ధరల్లో గృహ నిర్మాణం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో..

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ వృ ద్ధి లక్ష్యాలకు, ద్రవ్యలోటు నియంత్రణకు మ ధ్య బడ్జెట్ ఒక చక్కటి సమన్వయాన్ని సాధించాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక క్రమ శిక్షణ మార్గంలో స్థిరంగా పయనిస్తోంది. కోవి డ్ సమయంలో 9.2 శాతం  ఉన్న ద్రవ్యలోటు ను 2026 ఆర్థిక సంవత్సరానికి 4.4 శాతానికి తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోం ది. ఈ మార్గం నుంచి ప్రభుత్వం పెద్దగా పక్క కు వెళ్లకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

మోదీ ప్రభుత్వంలో 15వ బడ్జెట్

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇది 15వ బడ్జెట్ కాగా, నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికా ర్డు సృష్టించనున్నారు. గత బడ్జెట్లో మధ్యతరగతి వినియోగాన్ని పెంచేందుకు పన్ను రాయి తీలపై దృష్టి సారించగా, ఈసారి వినియోగాన్ని ప్రోత్సహించే విధానం పరిమితంగానే ఉంటుందని తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాల్లో మూలధన వ్యయాన్ని పెంచడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నా యి. పెట్టుబడిదారులు ప్రభుత్వ రుణాల వివరాలు, ద్రవ్యలోటు లక్ష్యాలు, కొత్త అప్పుల ప్రణాళికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆదివారమైనా.. పూర్తిస్థాయి ట్రేడింగ్

ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26, వచ్చే ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్‌వై27) వృద్ధి రేటు 6.8% నుంచి 7.2% మధ్య ఉండవచ్చని అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.4% కంటే కొంచెం తక్కువ. బడ్జెట్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో పూర్తిస్థాయి ట్రేడింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.