01-02-2026 01:34:35 AM
ఇస్లామాబాద్, జనవరి 31: పాకిస్థాన్‌లో ని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శనివారం బలోచ్ వేర్పాటువాదులు జరిపిన సమన్వయ దాడుల్లో 10 మంది భద్రతా సిబ్బంది మరణించగా, ఎదురుకాల్పుల్లో 37 మంది ఉగ్రవా దులు హతమయ్యారు. మొత్తం 12కు పైగా ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులకు బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) బాధ్యత వహించింది. పాకిస్తాన్ దశాబ్దాలుగా బలూచిస్తాన్‌లో వేర్పాటువాద తిరుగుబాటుతో పోరాడుతోంది.
సైనిక స్థావరాలు, పోలీస్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వేర్పాటు వాదులు ఆత్మహుతి దాడులకు తెగబడ్డారు. మృతుల్లో 10 మంది భద్రతా సిబ్బంది, ఐదుగురు పౌరులు (ఒక మహిళ, ముగ్గురు పిల్లల తో సహా) మృతిచెందారు. భీకర దాడులతో బలూచిస్థాన్లో మొబైల్ సేవలు నిలిపివేత, రైలు సేవలకు అంతరాయం కలిగింది. ప్రస్తు తం పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆర్మీ అధికారి తెలిపారు.