4 April, 2026 | 6:16 PM

కామ్రేడ్ బాల మల్లేష్, పోటు ప్రసాద్ ల మరణం పార్టీకి తీరని లోటు..

01-12-2024 10:06 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): కామ్రేడ్ లు బాల మల్లేష్, పోటు ప్రసాద్ ల అకాల మరణం తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి తీరని లోటని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. గుండె పోటుతో మృతి చెందిన రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ బాల మల్లేష్, ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ లకు ఆదిలాబాద్ లోని సీపీఐ కార్యాలయంలో వారి చిత్ర పటాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలాస్ మాట్లాడుతూ... బాల మల్లేష్ AISF నుండి CPI రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఏదగరన్నారు. కామ్రేడ్ బాల మల్లేష్ చాలా కమిట్మెంట్ తో పార్టీకి సేవాలాందించారాని గుర్తు చేశారు. కామ్రేడ్ పోటు ప్రసాద్ సైతం AISF నుండి ఎదిగి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు AITUC కి నాయకత్వం వహించారన్నారు. వారిది త్యాగల కుటుంబం అని కొనియాడారు. ఈ కార్యక్రమం సీపీఐ నాయకులు సిర్ర దేవేందర్, అరుణ్ కుమార్, చిల్కా దేవిదాస్, మెస్రం భాస్కర్, వాసీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.