2 September, 2026 | 2:11 AM

శ్రీవిష్ణుకు జోడీగా..?

02-09-2026 | 01:19am

‘ఇరుముడి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నుంచి రాబోతున్న తదుపరి చిత్రం భారీ సంచలనం సృష్టిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ హాసిత్ గోలీ(Director Hasith Goli) తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది.

ప్రస్తుతం ‘ఎస్‌వీసీ64’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు శ్రీవిష్ణు కూడా ప్రధాన పాత్రలో కనిపిస్తుండటంతో ఇది టాలీవుడ్‌లో అత్యంత క్రేజియెస్ట్ మల్టీస్టారర్లలో ఒకటిగా మారింది. ఈ బిగ్ ప్రాజెక్టును శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన్ప స్టార్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను లక్ష్యంగా చేసుకుని, జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా స్పష్టం చేశారు. దీంతో పండుగ రేసులో ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ఇందులో నటించే నటీనటుల గురించి సోషల్ మీడియాలో నిరంతరం ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ఇక ఇందులో రవితేజ సరసన నటించడానికి ఐశ్వర్య రాజేశ్‌ను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ చిత్రంలో శ్రీవిష్ణుకు జోడీగా కోలీవుడ్ గ్లామర్ బ్యూటీ మాళవిక మోహనన్‌ను తీసుకున్నట్లు సమాచారం. రవితేజ రాజేశ్, శ్రీవిష్ణు మోహనన్ కాంబినేషన్లు కొత్త అనుభూతిని ఇస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.