వాటర్ ట్యాంకును వినియోగంలోకి తేవాలి
మహబూబాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం నిర్మించిన వాటర్ ట్యాంక్ను ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు తాగునీటి సరఫరా మెరుగుపడేందుకు ఈ వాటర్ ట్యాంక్ను వెంటనే ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు గుండా పోతురాజు, జకీర్, మాజీ వైస్ చైర్మన్ ఫరీద్, సొసైటీ చైర్మన్ నాయిని రంజిత్, బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు త్వరలోనే వాటర్ ట్యాంక్ ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.






