శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రముఖులు
వేములవాడ, జూన్12,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్,మున్నూరు కాపు కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఈఓ రమాదేవి, డిప్యూటీ ఈఓ భాస్కర్ శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ జి. అశోక్ కుమార్, ప్రోటోకాల్, ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొన్నారు.






