షాదీఖానా స్థలాన్ని మైనారిటీలకు అప్పగించాలి
హనుమకొండ, జూలై 28 (విజయ క్రాం తి): మైనార్టీల సంక్షేమం కోసం గత ప్రభు త్వం షాదీఖానా కోసం కేటాయించిన స్థలా న్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి స్వాధీ నం చేసుకోవాలని చూస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షు లు నయీమొద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదివారం హనుమకొండ బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నయముద్దీన్ మాట్లాడుతూ 2023లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మైనార్టీల సంక్షేమం కోసం షాదీఖానా నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంతో అప్ప టి ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కాజీపే ట మండలం న్యూశాయంపేట పరిధి 597 సర్వే నంబర్ లోని 25 గుంటల స్థలాన్ని కేటాయించడం జరిగిందని, మైనారిటీలకు కేటాయించిన స్థలాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మైనార్టీలుగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి, కుడా చైర్మన్కు మైనార్టీలకు కేటాయించిన స్థలం జోలికి రా వద్దని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేయాలని, స్వాధీ నం చేసుకొని బడా బాబులకు అప్పజెప్పాలని చూస్తున్నారని, మైనార్టీలుగా ఈ చర్యల ను ఖండిస్తున్నాం అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి షాదీఖానా కోసం కేటాయించిన స్థలం తిరిగి మైనార్టీలకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
లేని పక్షంలో దశల వారిగా మైనారిటీలను కూడా కట్టుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్ మెంబర్ దర్శన్ సింగ్ మాట్లాడుతూ మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకు గానే చూస్తోందన్నారు. మైనార్టీ నా యకులు షేక్ మహమూద్ మాట్లాడుతూ.. పేదల జాగలను గుంజుకొని పెద్దలకు కట్టబెట్టే గుణం కాంగ్రెస్ సర్కారుది ఎప్పటి నుం చో ఉందని, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలాలకు రేకులు పెట్టి ఆ జాగను బడాబాబులకు కట్టబెట్టాలని చేస్తున్న కుట్రలను ప్రజలు గ మనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మా జీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, నాయకులు కమురున్నీసా బేగం, ఖలీల్, ఫెరోజ్, ఎండీ గౌస్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.






