అయోధ్య కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి
బోయపల్లి రాఘవేందర్ రెడ్డి
బడంగ్‌పేట్ జూన్ 28 (విజయక్రాంతి): అయోధ్య కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసేందుకు తగిన కృషి చేస్తానని ఏఐసీసీ విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి హామీ ఇచ్చారు. అయోధ్య కాలనీ వాసుల కోరిక మేరకు ఆదివారం బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి స్థానికులతో కలిసి కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
అనంతరం సంబంధిత ఏఈ హరీష్ కి ఫోన్ చేసి కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని పూర్తిగా వివరించి, సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. దీనిపై స్పందించిన ఏఈ హరీష్ రేపు కాలనీని స్వయంగా సందర్శించి పరిశీలించి, రోడ్లు మరియు డ్రైనేజీ అభివృద్ధి పనులను కొత్త ప్రతిపాదనల ద్వారా శాంక్షన్ చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో రమణ రాజు, అయోధ్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సిల్వేరి శ్రీధర్, నాగేశ్వరరావు, సైదోజి, నరేంద్ర, సాయి కృష్ణ, రాకేష్,కృష్ణ, మధుసూదన్ రెడ్డి, సురేష్ బాబు, శ్రీరాములు, బాలు కుమార్,మాలకొండయ్య, శ్రీకాంత్ (జగన్) తదితరులు పాల్గొన్నారు.






