29 June, 2026 | 2:03 AM

పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

29-06-2026 12:00 AM

అలకాపురి చౌరస్తాలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు

నాగోల్, జూన్ 28 (విజయక్రాంతి): మాజీ ప్రధానమంత్రి, భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, తెలంగాణ గర్వకారణం పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా కొత్తపేట ఆర్కే పురం డివిజన్ పరిధిలోని అలకాపురి కాలనీ చౌరస్తాలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆర్కే పురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత, యువజన కాంగ్రెస్ నాయకుడు చిలక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూలమాలలు వేసి పీవీ సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ధైర్యవంతమైన నిర్ణయాలతో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహానేత పీవీ నరసింహారావు అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగానే భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగే పునాది పడిందన్నారు. బహుభాషా కోవిదుడిగా, దూరదృష్టి కలిగిన రాజకీయవేత్తగా పీవీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.

ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, కాంగ్రెస్ నాయకులు ముప్పిడి లింగస్వామి గౌడ్, మహమ్మద్, రామకృష్ణ గౌడ్, కానాల శ్యాంసుందర్ రావు, పంతంగి రంగారావు, రమణ, దేవులపల్లి రంగారావు, గూడ జయరాం, నరసింహారావు, నరసింహ, యాదయ్య, వినయ్ కుమార్, రమేష్ గౌడ్, రఫీ, సైదులు, విప్లవ్ రెడ్డి, నగేష్తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, పీవీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.