27 February, 2026 | 5:37 AM

అంగరంగ వైభవంగా శ్రీ తిరుమలనాథస్వామి వారి కళ్యాణం

27-02-2026 12:00 AM

వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, ఫిబ్రవరి 26 : చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో గురువారం శ్రీశ్రీ భూ సమేత తిరుమలనాధ స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు దోహదపడతాయని అన్నారు.

నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలిగి ఉండాలని ఆయన ఆ భగవంతుడిని ప్రార్థిస్తు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామస్తుడు పున్న రాములు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓర్సు రాజకుమార్, గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, ఆలయ ధర్మకర్తలు ఏర్పుల యాదమ్మ నరసింహ, చల్లమల్ల మధుసూదన్ రెడ్డి, జెల్ల నరసింహ, సాపిడి యాదగిరి, మాజీ సర్పంచ్ జలంధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ముద్దసాని నీత రమణారెడ్డి, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.