27 February, 2026 | 3:56 AM

క్రీడలు ఐక్యత భావాన్ని పెంపొందిస్తాయి

27-02-2026 12:00 AM

ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ 

దేవరకొండ, ఫిబ్రవరి 26 : క్రీడలు మనలో ఐక్యత భావాన్ని పెంపొందిస్తాయని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోనీ  స్థానిక స్పోరట్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

యువతలో సామాజిక బాధ్యతాభావం, సేవా గుణం, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా, టీమ్వర్క్, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం వంటి విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

యువత ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రధాన శక్తి అని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం మెరుగుపరచడంలో తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేష్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహ, నేరేడుగొమ్ము మాజీ ఎంపీపీ బిక్కు నాయక్, మాజీ వైస్ ఎంపీపీ పాప నాయక్, మాజీ కౌన్సిలర్ జయప్రకాష్, సర్పంచులు కొర్ర రాంసింగ్, బాబురాం నాయక్, లక్పతి, రమేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.