3 April, 2026 | 3:15 AM

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

03-04-2026 12:15 AM
  1. ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ
  2. అల్మాయిపేట గ్రామసభ నిర్వహణ

సంగారెడ్డి, ఏప్రిల్ 2(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఆందోల్ మండలం అల్మాయిపేట గ్రామంలో నిర్వహించిన గ్రా మసభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో అమ లు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల లబ్ధిదారుల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసు కుంటున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి గ్రామంలో మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకో వాలని సూచించారు.

గ్రామంలోని 28 స్వయం సహాయక సంఘాలకు రూ.3.50 కోట్ల రుణాలు అందించగా, రూ.2.50 లక్షల వడ్డీ సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రైతు భీమా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఎన్నో అమలు చేస్తున్నట్లు చెప్పారు. అల్మాయిపేట గ్రామంలోని సర్వే నం. 513లో కొత్త కాలనీ ఏర్పాటు చేస్తే రహదారులు, నీటి ట్యాంక్, విద్యుత్ సౌకర్యాలు, ఇళ్ల నిర్మాణం వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, హైవే నుండి అల్మాయిపేటకొన్యాల వరకు బీటీ రహదారి, అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజూరు చేస్తామని తెలిపారు. ఆందోల్ నియోజకవర్గంలో త్వరలో ఫార్మసీ కళాశాల స్థాపన జరుగుతుందని, సంగుపేట గుట్ట వద్ద రెండు మూడు పరిశ్రమలు రానున్నట్లు వెల్లడించారు.

అనంతరం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు గృహ నిర్మాణానికి మంత్రి, కలెక్టర్ కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ పాండు, సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్లో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ 316 వర్ధంతి సందర్భంగా మంత్రి దామోదర పూలమాల వేసి నివాళులు అర్పించారు.