11 April, 2026 | 10:04 PM

రైతుల సంక్షేమమే ధ్యేయం

03-01-2026 12:00 AM

సూపెరింటెండింగ్ ఇంజనీర్  మేక రమేష్ బాబు

ముకరంపుర, జనవరి 2 (విజయ క్రాంతి): రైతులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ అధికారులు నేరుగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి సమస్యలను పరిష్కరించే ‘విద్యుత్ అధికారుల పొలం బాట‘ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని కరీంనగర్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్  మేక రమేష్ బాబు తెలిపారు. పొలం బాట ద్వారా ఇప్పటి వరకు సర్కిల్ పరిధిలో 1055 పొలంబాట కార్యక్రమాలు నిర్వహించామని, ఈ తనిఖీల్లో గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

572 వంగిన స్తంభాలను సరిచేశామని, 2650 చోట్ల లూజ్ లైన్లను బిగించామని, 1343 మధ్య స్తంభాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు, వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ పనులను స్వంతంగా చేయకూడదని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులను సంప్రదించాలని కోరారు. రైతులకు ఎటువంటి విద్యుత్ ఇబ్బందులు తలెత్తినా వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.