calender_icon.png 3 January, 2026 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ డిగ్రీ కళాశాలకు పక్కా భవనం నిర్మించాలి

03-01-2026 12:00:00 AM

  1. జిల్లా నుంచి తరలిపోయే ప్రమాదంలో వ్యవసాయ కళాశాల

బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి, జనవరి 2 (విజయక్రాంతి) : వనపర్తి జిల్లాకు మంజూరైన వ్యవసాయ మహిళ డిగ్రీ కళాశాలకు పక్కా భవనం నిర్మించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దగూడెం గ్రామ శివారులో గల వ్యవసాయ మహిళ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించి, సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా  మారాయన్నారు.

2022లో రాష్ట్రంలో రెండు కళాశాలలు మంజూరు కాగా ఒకటి కరీంనగర్, మరొకటి వనపర్తికి మంజూరు కావడం జరిగిందని, ఏ విద్య సంస్థకైనా  సంవత్సరాలు గడిచే కొద్దీ సదుపాయాలు మెరుగు పడతాయని, కానీ జిల్లాకు మంజూరైన కళాశాల విషయంలో మాత్రం  సౌకర్యాలు మెరుగు పరచకపోగా కళాశాలనే జిల్లా నుంచి తరలిపోయే ప్రమా దం వాటిల్లుతుందన్నారు.

జిల్లాలో ఉన్న నాయకులు ఈ కళాశాలపై ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, స్పోరట్స్ అథారిటీ చైర్మన్ ఇలా మహామహులు ఉన్నప్పటికీ కళాశాల తరలిపోయే ప్రమాదం ఉందన్న సోయి మరిచారా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే కళాశాలను సందర్శించి పక్కాభవనం నిర్మించాలని, అలా చేస్తేనే కళాశాల ఇక్కడి నుంచి తరలిపోకుండా ఉంటుందని, లేని పక్షంలో బీసీ పొలిటికల్ జెఎసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. 

కార్యక్రమంలో పొలిటికల్ జెఎసి నాయకులు దేవర శివ, అంజన్న యాదవ్, ధర్మేంద్ర సాగర్, రాఘవేందర్ గౌడ్, అస్కని రమేష్, చెలిమిల్ల రామన్ గౌడ్, రమేష్ గౌడ్, కురుమూర్తి, గౌతమ్ శంకర్   పాల్గొన్నారు.