calender_icon.png 5 January, 2026 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవులు, వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత

03-01-2026 12:00:00 AM

జిల్లా అటవీశాఖాధికారి రేవంత్ చంద్ర

అచ్చంపేట, జనవరి 2: దేశంలోనే రెండో అతిపెద్ద పులుల అభయారణ్యమైన అమ్రాబాద్ అభయారణ్యంలో వన్య ప్రాణుల సంరక్షణ అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నాగర్ కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. అచ్చంపేటలోని అటవీశాఖ కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలను సిబ్బందితో కలిసి నిర్వహించుకున్నారు.

ఈ సందర్భంగా నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు.  అటవీ శాఖ సిబ్బంది సమిష్టి కృషితోనే అడవుల సంరక్షణ సాధ్యమవుతుందని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజల భాగస్వామ్యంతో అటవీ పరిరక్షణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో  అచంపేట ఎఫ్డిఓ, రేంజర్ అధికారుల సంఘం, జూనియర్ అటవీ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.