16 March, 2026 | 10:54 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ప్రజా ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి పెద్ద పీట

16-03-2026 12:00 AM

మహబూబాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, గత పాలకులు అప్పుల కుప్పగా మార్చారని, అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శాయంపేట మండలంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అనంతరం ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరుల కోసం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి శుభాకాంక్షలు తెలిపారు.