నీట్‌పై దేశమంతా రచ్చ
- పరీక్షలో అవకతవకలపై స్పందించిన కేంద్రం
తప్పులు జరిగితే చర్యలు తీసుకుంటామన్న మంత్రి ధర్మేంద్ర
కోర్టు నేతృత్వంలో విచారించాలని విపక్షాల డిమాండ్లు
ఈ విషయంపై ప్రధాని స్పందించాలన్న కేటీఆర్
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): నీట్‌లో అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా గా పేపర్ లీకేజీ జరిగిందని వార్తలు రావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం స్పందించారు. పరీక్షలో అవకతవకలపై తమ దృష్టికి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు 1,563 మంది విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రెండు చోట్ల ఈ అక్రమాలు వెలుగు చూశాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ తీసుకుందని తెలిపారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని విద్యార్థులు, తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ తన పనితీరును చాలా మెరుగుపరు చుకోవాలి. ఉన్నతాధికారు ప్రమేయమున్నా విడిచిపెట్టం అని ప్రధాన్ స్పష్టం చేశారు.
పరీక్ష రద్దు చేయాలి
నీట్ రద్దు చేయాలని పరీక్ష రాసిన 20 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షలో జరిగిన అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం వద్ద పలువురు ఆందోళన చేపట్టారు. నాలుగు కార్లలో వీరు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వారి వద్ద ఎన్‌ఎస్‌యూఐ కరపత్రాలు ఉన్నాయి. వీరంతా మంత్రి నివాసంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు చెదరగొట్టారు. సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేశారు.
పార్లమెంట్‌లో చర్చించాలి
మరోవైపు నీట్ వివాదంపై విపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. ఈ విష యంలో సుప్రీంకోర్టు నియమించే బృందంతో విచారణ జరిపించాలని కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. నీట్ విషయంలో గుజరాత్‌లో జరిగిన సంఘటనలు ఎంతో కలవరపరిచాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో నీట్‌ను సమర్థంగా ఎలా నిర్వహి ంచాలనే అంశంపై అన్ని రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనంగా ఉండటం సరికాదని ఆరోపించారు.
తమిళనాడులో ఆగ్రహం
నీట్ ప్రవేశపెట్టిన ఏడాది నుంచి వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుత వివాదంపై ఘాటుగా స్పందించింది. పరీక్ష నిర్వహణలో స్కాం జరిగిందని, ఇప్పటికైనా నీట్‌కు ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. నీట్ ఒక పెద్ద మోసమని తమిళనాడు ముందే చెప్పిందని గుర్తుచేశారు. ఈ అక్రమాలు విద్యార్థుల భవిష్య త్తుకు హానికరమని మండిపడ్డారు. రాజకీయ, ఆర్థిక పరిస్థితులు విద్యకు అడ్డంకి కావద్దని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులు సైతం మొదటి నుంచి నీట్ అక్రమాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రధాని మోదీ స్పందించాలి: కేటీఆర్
తమ పిల్లలు డాక్టర్ కావాలన్న తల్లిదండ్రులకు ఆశలపై నీట్ వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. నీట్ అవకతవ కలపై ఆయన ఆదివారం బహిరంగ లేఖను రాసి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బీహార్‌లో రూ.30 లక్షల చొప్పన ప్రశ్నపత్రాలు విక్రయించారని, పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమన్నారు. విద్యార్థు లతో పరీక్ష పే చర్చా కార్యక్రమం నిర్వహించే ప్రధాని మోదీ కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ వ్యవహారంలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.






