calender_icon.png 21 January, 2026 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్తను హతమార్చిన భార్య

21-01-2026 01:40:52 AM

కూకట్‌పల్లిలో డిసెంబర్ 24న ఘటన

నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడ్చల్, జనవరి 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఒక దారు ణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య తన భర్తను ఏకంగా చున్నీతో ఉరేసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. వివరా ల్లోకి వెళ్లే.. సుధీర్‌రెడ్డి (44), ప్రసన్నలు భార్యాభర్తలు. వీరు కూకట్‌పల్లిలోని ఈనా డు కాలనీలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భార్య ప్రసన్న వివాహేతర సంబంధానికి, జల్సాలకు అడ్డు వస్తున్నాడని గత సంవత్సరం డిసెంబర్ 24న తన భర్తను చున్నీతో ఉరేసి హత్య చేసింది.పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

అయితే సుధీర్‌రెడ్డి సోదరి సునీత ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్ట్‌మార్టం ఆధారంగా పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పోలీసులు సుధీర్‌రెడ్డి భార్య ప్రసన్నను విచారించగా భర్తను చున్నీతో మెడకు చుట్టి తానే హతమార్చానని భార్య ప్రసన్న ఒప్పుకుంది. దీంతో నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సుధీర్ రెడ్డి భార్య తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తోందని పోలీసులకు వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే తన భర్తను హతమార్చింది.