21-01-2026 01:38:16 AM
డ్యూడెనల్ క్యాన్సర్‌కు హైబ్రిడ్ ల్యాపరాస్కోపిక్ రోబోటిక్ విపుల్స్ శస్త్రచికిత్స
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు అత్యంత క్లిష్టమైన, సాంకేతికంగా సవాలుతో కూడిన హైబ్రిడ్ ల్యాపరాస్కోపిక్‌రోబోటిక్ విపుల్స్ శస్త్రచికిత్సను విజయ వంతంగా నిర్వహించారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను డా. మన్నెం మనోజ్ కుమార్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, రోబోటిక్ జీఐ సర్జన్, తన నిపుణుల బృం దంతో కలిసి విజయవంతంగా పూర్తి చేశా రు. 57 ఏళ్ల వయసున్న షేక్ రబ్బాని పాషా అనే రోగికి ఎండోస్కోపిక్ పరీక్షల్లో డ్యూడెనమ్ (ఆహారనాళం రెండవ భాగం)లో గడ్డ ఉన్న ట్లు గుర్తించబడింది.
బయాప్సీ పరీక్షల్లో ఇది సిగ్నెట్ రింగ్ సెల్స్తో కూడిన డ్యూడెనల్ అడెనోకార్సినోమాగా నిర్ధారణ అయ్యింది. ఇది అరుదైనదే కాకుండా అధిక ప్రమాదకరమైన క్యాన్సర్. విపుల్స్ శస్త్రచికిత్స అనేది పొత్తికడుపులో చేసే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలలో ఒకటి. ఈ కేసులో, మెడికవర్ వైద్యులు ఆధునిక హైబ్రిడ్ విధానాన్ని అనుసరించారు. ఇందులో ల్యాపరా స్కోపిక్ పద్ధతిలో క్యాన్సర్ గడ్డను తొలగించడం, తరువాత డీఏవిన్సి ఎక్స్ రోబోటిక్ సిస్టమ్ సహాయంతో పునర్నిర్మాణ శస్త్రచికిత్స నిర్వహించారు.
ఈ విధానం వల్ల ట్యూమర్ తొల గింపులో సౌలభ్యం, పునర్నిర్మాణ దశలో అత్యధిక ఖచ్చితత్వం సాధ్య మైంది. ప్రత్యేకంగా ప్యాంక్రియాటోజీజునోస్టోమీ, హెపా టికోజీజునోస్టోమీ వంటి సున్నితమైన, అధిక ప్రమాదం ఉన్న అనాస్టమోసిస్లను రోబోటిక్ సిస్టమ్ సహాయంతో అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సలో డా. ఘన్ శ్యామ్ ఎం. జగత్కర్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ (క్రిటికల్ కేర్), డా. జోగు కిరణ్ కుమార్ కన్సల్టెంట్ (మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ), డా. వేణు గోపాల్ అనస్థీషియా లజిస్ట్ కీలక పాత్ర పోషించారు.