27 June, 2026 | 1:50 AM

రాజకీయ సాధికారత కోసమే మహిళా బిల్లు

27-06-2026 12:47 AM

జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి కమలాక్షి

రామచంద్రపురం, జూన్ 26 : రామచంద్రాపురం డివిజన్ పరిధి బాలాజీ గార్డెన్స్లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యం లో మహిళా కాంగ్రెస్ ముఖ్య సమావేశం ని ర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ మ హిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  కమలాక్షి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు  ఎర్రబెల్లి స్వర్ణ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంజలితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మహిళా కాంగ్రెస్ సంస్థను గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేయడం, మహిళల భాగస్వామ్యాన్ని పార్టీ కార్యక్రమాల్లో పెంపొందించడం, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు.

గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మహిళా కాంగ్రెస్ను మరింత పటిష్ఠం చేసి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా మహిళలకు శాసనసభలు, పార్లమెంట్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. మహిళల రాజకీయ సాధికారతకు ఈ బిల్లు కీలకమని, ఇప్పటికే చట్టరూపం దాల్చిన ఈ బిల్లును ఆలస్యం చేయకుండా అమలు చేసి మహిళలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.