27 June, 2026 | 1:52 AM

ఎస్‌ఐఆర్ పక్రియకు సహకరించాలి

27-06-2026 12:48 AM

భూత్పూర్, జూన్ 26: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని తహసిల్దార్ కిషన్ అన్నారు. ఈ సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఆయన స్వయంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ఓటర్లు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్యుమరేషన్ ఫారంలో ఓటర్లకు సంబంధించిన అన్ని వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆయన సూచించారు. ఏ ఒక్క అర్రుడైన ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదని, అర్హుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాకుండా అధికారులు, ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఓటర్లకు గణన పత్రాలు పంపిణీ చేస్తున్నారని, అన్ని వివరాలు నమోదు చేసి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, తదితర ధ్రువీకరణ పత్రాలు జత చేసి డిఎల్‌ఓ లకు అందిస్తే వాటిని పరిశీలించి ధృవీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  కేంద్యాల నరేందర్, మట్టి ఆనంద్, బి ఎల్ ఓ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.