15 July, 2026 | 4:24 AM

ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి రీల్ వైరల్

22-06-2024 01:04 AM
  • ‘అద్దెకు గర్ల్‌ఫ్రెండ్’ పేరుతో రీల్

వివిధ సేవలకు ధరలు ప్రకటించిన యువతి

రీల్ వైరల్.. విమర్శిస్తున్నపలువురు నెటిజన్లు

న్యూఢిల్లీ, జూన్ 21: అద్దెకు గర్ల్ ఫ్రెండ్ అంటూ గురుగ్రామ్‌కు చెందిన 25 ఏళ్ల యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన రీల్  విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రీల్ ఇప్పటివరకు 9.1 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భారతీయ సంస్కృతికి విరుద్దంగా రీల్ ఉందంటూ సోషల్ మీయాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు. వివాదానికి దారితీసిన ఈ రీల్‌పై దివ్య స్పందించింది. జపాల్‌లో ఇలాంటి రీల్స్ చూసి ప్రేరణ పొందానని, అందుకే అద్దెకు గర్ల్ ఫ్రెండ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పోస్ట్ చేశానని తెలిపింది. నెటిజన్లను నవ్వించడానికే తప్ప నిజంగా డబ్బు కోసం ఇలాంటి రీల్ చేయలేదని పేర్కొంది.

అసలేం జరిగింది?

తనతో డేటింగ్‌కు రావాలనుకునే అబ్బాయిల కోసం రూ. 1500 నుంచి రూ. 10 వేల వరకు ప్లాన్లను ప్రకటిస్తూ దివ్య కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నార్మల్ కాఫీ డేట్ నుంచి వీకెండ్ గేట్‌వేస్ వరకు ఏ డేట్‌కు ఎంత అద్దె చెల్లించాలో వివరంగా తెలిపింది. తనను ఒక రోజు అద్దెకు తీసుకోండి.. మధురమైన స్మృతులను మదిలో ఉంచుకోండి... అంటూ రాసుకొచ్చింది. చిల్ కాఫీ డేట్‌కు రూ. 1500, నార్మల్ డేట్ (డిన్నర్ అండ్ మూవీ) రూ. 2 వేలు, మీటింగ్ విత్ ఫ్యామిలీ రూ. 3 వేలు.

ఈవెంట్ కంపానియన్ రూ. 3500, బైక్ డేట్ (హోల్డింగ్  హ్యాండ్స్ అండ్ ఆల్) రూ. 4 వేలు. పబ్లిక్ పోస్ట్ అవర్ డేట్ రూ. 6 వేలు, అడ్వెంచర్ డే (హైకింగ్, కాయకింగ్ ఎక్సెట్రా) రూ. 5 వేలు, కుకింగ్ టుగెదర్ ఎట్ హోమ్ రూ. 3500, షాపింగ్ స్ప్రీ రూ. 4500, వీకెండ్ గేట్‌వే (2 డేస్) రూ. 10 వేలు.. ఇలా వివిధ ప్లాన్లను రీల్‌లో పోస్ట్ చేసింది. దీంతో, దివ్య రీల్ వైరల్ అయ్యింది. ఇప్పటివరకు 9.1 మిలియన్ వ్యూస్, 10 వేలకు పైగా కామెంట్స్ సాధించింది. 

జపాన్ స్ఫూర్తితో..

కాగా, జపాన్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు తమ రిలేషన్‌షిప్‌లో ఒకరినొకరు డేటింగ్ చేసుకోవడం సర్వసాధారణం. ఆ దేశంలో బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్ అద్దెకు అందుబాటులో ఉంటారు. ఒంటరిగా ఉండే వ్యక్తులు డబ్బు చెల్లించి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. జపాన్‌లో దాదాపు 40 శాతం మంది ప్రజలు ఒంటరిగా ఉన్నారని 2023లో ది జపాన్ న్యూస్ సర్వేలో తేలింది. ఒంటరితనం కారణంగా దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యల రేటును తగ్గించడానికి ఇలాంటి వినూత్న విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు, భారతీయ అమ్మాయి జపాన్ స్ఫూర్తితో ఇలాంటి పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.