7 August, 2026 | 2:06 PM

కైలాస్ కేకిడి శివాలయంలో దొంగతనం

07-08-2026 01:33 PM

బోథ్, ఆగస్ట్ 7 ( విజయక్రాంతి): మండలం సరిహద్దుల్లోని అడవుల్లో ఉన్న కైలాస్ టేకిడి ఆలయంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. గురువారం ఉదయం పూజ చేసేందుకు వెళ్లిన లింభాజీ మహారాజ్ దొంగతనం జరిగిన విషయాన్ని గమనించారు. శివలింగం చుట్టూ ఉన్న వెండి కిరీటం తోపాటు హుండీని పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. దొంగతనం జరిగిన విషయాన్ని గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.