7 August, 2026 | 2:34 PM

ప్రజాసేవే పరమావధిగా... బీర్ల అనిత సేవలు

07-08-2026 01:31 PM

ఆలేరు, ఆగస్టు 7 (విజయక్రాంతి): బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనిత జన్మదినం సందర్భంగా ఆమె చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సహకారంతో ప్రజా సేవలో చురుకుగా కొనసాగుతున్న ఆమె, ఆలేరు నియోజకవర్గంలోని ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం, క్వింటాల్ బియ్యం పంపిణీ, నిరుపేద యువతుల వివాహాలకు చేయూత, ఉచిత అంబులెన్స్ సేవలు, పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తూ సేవలందిస్తున్నారు. ప్రజల అవసరాలకు వెంటనే స్పందిస్తూ బీర్ల ఫౌండేషన్ ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీర్ల అనితకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆమె మరింత కాలం ప్రజాసేవ కొనసాగించాలని పలువురు ఆకాంక్షించారు.