7 August, 2026 | 3:07 PM

చనిపోయాకా గుర్తుండేలా బ్రతకడమే గొప్ప జీవితం!

07-08-2026 02:03 PM

కన్నేటి వెంకన్న సేవలు చిరస్మరణీయం : మంత్రి పొంగులేటి

మంగళగూడెంలో విగ్రహావిష్కరణ.. ఘనంగా ద్వితీయ వర్ధంతి

ఖమ్మం రూరల్, ఆగస్టు 07 (విజయక్రాంతి): ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు మరణించక తప్పదని, అయితే చనిపోయిన తర్వాత కూడా సమాజం తలుచుకునేలా, ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా జీవించడమే అత్యున్నతమైన జీవితమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఖమ్మం రూరల్ మండలం(Khammam Rural Mandal) మంగళగూడెం గ్రామంలో శుక్రవారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ కన్నేటి వెంకన్న రెండో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకన్న విగ్రహాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అంతకుముందు గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా మంత్రి ఆవిష్కరించారు.

పదిమందికీ మేలు చేయడమే అసలైన సంపాదన : మంత్రి పొంగులేటి

"మానవ జన్మలో సంపాదించే ఆస్తిపాస్తుల కంటే, నలుగురికి చేసిన సాయం, సంపాదించుకున్న అభిమానమే శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. కన్నేటి వెంకన్న తన జీవితాంతం ప్రజల కోసమే తపించారని కొనియాడారు. ఏ కష్టం వచ్చినా 'నేనున్నానంటూ' నిలబడ్డారని, అందుకే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన రూపం విగ్రహమై ఈ ఊరిలో నిలిచిందన్నారు. ఆయన చూపిన సేవా మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కన్నేటి వెంకన్న కుటుంబ సభ్యులు,  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.