03-12-2025 04:26:42 PM
పంచాయతీ తాళం పగలగొట్టి అపహరణ..
వికారాబాద్ జిల్లాలో ఘటన
విచారణ జరుపుతున్న సబ్ కలెక్టర్, డీఎస్పీ
తాండూరు (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చోరికి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లిలో చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గొట్లపల్లి క్లస్టర్ పరిధిలో గొట్లపల్లి, గిర్మాపూర్, జయరాంతాండా పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను స్వీకరించారు. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు ఎన్నికల అధికారులు గొట్లపల్లి పంచాయతీ కార్యాలయంలోనే భద్రపరిచారు.
అయితే బుధవారం ఉదయం పంచాయతీ కార్యాలయం తాళం ధ్వంసం చేసి కార్యాలయంలో ఉన్న సర్పంచ్, వార్డ్ అభ్యర్థుల నామినేన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పంచాయతి ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల నామినేష్లు చోరికి గురికావడం కలకలం రేపుతోంది. ఈ సఘటనపై అధికారులు విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.