13 April, 2026 | 1:28 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

ఉద్యోగుల కంటే సమస్యలే ఎక్కువ

19-02-2026 02:45 AM

టీఎన్జీవోస్, టిఇజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్

ముషీరాబాద్, ఫిబ్రవరి18 (విజయక్రాంతి): అన్ని రకాల ఉద్యోగుల కంటే ఎక్కు వ సమస్యలు ఒత్తిళ్లు ఎదుర్కొనేది కేవలం వసతి గృహ అధికారులు మాత్రమేనని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ లు అన్నారు.

ఈ మేరకు బుధవారం టీఎన్జీవోస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సెంట్రల్ ఫోరమ్- 2026 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వసతి గృహ సంక్షేమ అధికారుల సెంట్రల్ ఫోరమ్ అధ్యక్షులు డి. భాస్కర్ ఆధ్వర్యంలో టీఎన్జీవోఎస్, టీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనిల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రకాల ఉద్యోగుల కంటే ఎక్కువ సమస్యలు, ఒత్తిళ్ళు ఎదుర్కునేది కేవలం వసతి గృహ అధికారులు మాత్రమేనని, వారి సమస్యలు ప్రభుత్వ ఉన్నతధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిస్కారం చూపుతామని అన్నారు.  ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖలో కొన్ని సంవత్సరాల నుండి ప్రమోషన్స్ లేక ఇబ్బంది పడుతున్న వసతి సంక్షేమ అధికారుల సమస్యలను అతి త్వరలోనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో  అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ సిటీ అధ్యక్షులు శ్రీకాం త్, సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోఎస్ అధ్యక్షులు జావీద్ అలీ, తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారుల సెంట్రల్ ఫోరమ్ అధ్యక్షులు భాస్కర్, కార్యదర్శి మచేందర్, కార్య వర్గం, 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.