13 April, 2026 | 11:51 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

ఓయూలో బీఆర్‌ఎస్వీ నాయకుల అరెస్ట్

19-02-2026 02:43 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రెస్టును బీఆర్‌ఎస్వి నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం బాల్క సుమన్ ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సి టీలోని ఆరట్స్ కళాశాల వద్ద బీఆర్‌ఎస్వి నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్వి నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు, విద్యార్థి నాయకులకు తోపులాట జరిగింది. విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి... ఖబర్దార్ ఎంపీ వివేక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాయకులను విద్యార్థి నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బిఆర్‌ఎస్వి నాయకులు మండిపడ్డారు.