జమ్ములోనూ జీరో టెర్రర్ ప్లాన్
17-06-2024 01:35 AM
- ఉగ్రదాడులపై సమీక్షలో అమిత్ షా
న్యూఢిల్లీ, జూన్ 16: కశ్మీర్‌లో అమలుచేసినట్టుగానే జమ్ములోనూ జీరోటెర్రర్ ప్లాన్ ను అమలుచేయాలని అధికారులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఇటీవల జరిగిన వరుస ఉగ్రదాడులపై ఆదివారం ఢిల్లీలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎన్‌ఎస్‌ఏ అజిత్‌దోవల్ పాల్గొన్నారు. షా మాట్లాడుతూ.. జమ్ములో ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలో ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రకు పటిష్ఠ భద్రత కల్పించాలన్నారు. కశ్మీర్‌లో మిషన్ విజయవంతమైందని, అదే విధానాన్ని జమ్ములో అమలుచేయాలని ఆదేశించారు. భక్తులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరారు.






