17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కాంగ్రెస్ వైపే ప్రజలు ఉన్నారు..

16-06-2025 12:03 AM

- ఆరు గ్యారెంటీ పథకాలు అందిస్తున్నాం

- హన్వాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్

మహబూబ్ నగర్ జూన్ 15 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ వైపే ప్రజలు ఉన్నారని 6 గ్యారంటీలు అద్భుతంగా అమలు చేస్తున్నామని హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి. మహేందర్ అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హన్వాడ మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని , అందులో భాగంగా ప్రతి తాండా కు బిటి రోడ్డు లు, ఎస్సీ సబ్ ప్లాన్ కింద కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారని, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రం నుంచి మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి ఇయ్యకపోయినా ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి వాళ్ళకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

హన్వాడ మండలంలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇందిరమ్మ ఇండ్లను పార్టీలకు అతీతంగా అర్హులకే కేటాయించడం జరిగింది అని ఆయన చెప్పారు. కావాలని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నారని, ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి కృష్ణయ్య యాదవ్, మండల కోఆర్డినేటర్ జే వెంకటయ్య మైనార్టీ సెల్ అధ్యక్షులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ చెన్నయ్య, షబ్బీర్ హుస్సేన్, యూత్ ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్, పార్టీ నాయకులు చెన్నయ్య, వాసు పాల్గొన్నారు.