9 April, 2026 | 12:15 AM

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

23-09-2024 01:50 AM

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: అమెరి కా తుపాకీ సంస్కృతి రోజురోజకూ పెరుగుతోంది.  నిత్యం ఏదో ఒకచోట కాల్పులు జరగుతూనే ఉన్నా యి. కాల్పుల్లో అమాయక విద్యార్థులతో పాటు సాధారణ పౌరుల ప్రా ణాలు బలిగొంటున్నాయి. తాజాగా అలబా మ రాష్ట్రంలోని ఓ బార్‌లో శనివారం రాత్రి కొందరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరు గాయపడగా, వారిని  ఆసుపత్రికి తరలిం చారు. ఘటనపై స్పష్టమైన వివరాలు అందలేదని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని అక్కడి పోలీసులు వెల్లడించారు.