అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
17-06-2024 01:13 AM
వాషింగ్టన్, జూన్ 16: అగ్రరాజ్యం అమెరికాలో నిత్యం ఏదో ఒకచోట తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. తాజాగా డెట్రాయిట్‌తో పాటు, టెక్సాస్‌లో కూడా కాల్పుల కలకలం రేగింది. డెట్రాయిట్‌లోని రోచెస్టర్ హిల్స్‌లో చిన్నారుల వాటర్ పార్కులో పిల్లలతో సరదాగా గడుపుతున్న కుటుంబాలపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 8 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. ఓ బాలుడి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లటంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని వెల్లడించారు.






