పాపపై దాడి సాక్ష్యాలు లేవు!
- ఆధారాల కోసమే అన్వేషణ!
కుమ్మెర జాతరలో ఘటనకు ముందే క్షీణించి ఉన్న పాప ఆరోగ్యం
హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స
చిన్నారి పోస్టుమార్టానికి మొదట నిరాకరించిన బంధువులు
అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశాం
నాగర్‌కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెర గట్టు జాతరలో జరిగిన ఘటనలో రెండు నె లల పాపతో పాటు తల్లి మౌనికపై దాడి జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు అందలేదని, దర్యాప్తు మరింత ముమ్మరం చేసినట్లు నాగర్‌కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయం లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 18న కుమ్మెర గట్టు మల్లన్న దర్శనం కోసం సాయంత్రం 3:30 నిమిషాలకు కుమ్మెర గ్రామానికి చెందిన చంద్రకళ, బూరమ్మ ఇద్దరూ దైవదర్శనం కోసం వెళ్లా రు. క్యూలైన్ దాటి ముందుకు జరగడంతో శ్రీనివాస్‌రెడ్డి మందలించాడు. దీంతోనే ఇరువురి మధ్య గొడవ జరిగిందని పూజారి పెద్ద సాయిలు యాదవ్ తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం గుడి కిందికి వచ్చి తన కుమారుడు గణేష్‌కు ఫోన్ ద్వారా జరిగిన గొడవ సమాచారం చేరవేయడంతో గణేష్ గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో వివాదాస్పద పోస్టు పం పినట్లు పేర్కొన్నారు.
గణేష్ ఎదురుపడిన క్రమంలో శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించడంతో కో పోద్రిక్తుడైన గణేష్.. అసభ్య పదజాలంతో దూషిస్తూ శ్రీనివాస్‌రెడ్డి తలపై రాయితో మోది గాయపరిచినట్లు శ్రీనివాస్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఆ తర్వాతే గణేష్ తన తల్లి చంద్రకళను శ్రీనివాస్‌రెడ్డితో పాటు శ్రీను, సతీష్‌రెడ్డి, మధు, పవన్, కన్ని, శ్రీకాంత్‌రెడ్డి, నరేష్ మరి కొంద రు స్థానికులు దాడి జరిపినట్లు గణేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.
గణేష్ డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాత్రి 8:30 గంటలకు శ్రీకాంత్‌రెడ్డి గాయాలతో వచ్చి గణేష్, తన తల్లి చంద్రకళ, వారి బంధువులు ఆశీర్వాద్, కీర్తి కాళ్లతో, రాళ్లతో దాడి జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దానిపై వెంటనే కేసు నమో దు చేసినట్లు పేర్కొన్నారు. మరో గంట తర్వా త శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఆరుగురు తనపై దాడి చేస్తూ,
చంద్రకళ, భైరమ్మలను అసభ్య పదజాలంతో దూషించినట్లు గణేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఆరోపణలు మాత్రమే కావడంతో జనరల్ డైరీలో నమోదు చేసి, కోర్టు అనుమతి కోసం పంపినట్లు తెలిపారు. మెడికల్ చెక్ అప్ కోసం పంపగా సాధారణ దెబ్బలేనని గుర్తించినట్లు తెలిపారు. ఆ ఫిర్యాదులో మౌనిక తన పాపపై దాడి జరిగినట్లు ఎలాం టి ప్రస్తావన లేదన్నారు. అనంతరం ఈ నెల 20న ఫిర్యాదు ప్రోగ్రెస్ గురించి రెండు పక్షాలు స్టేషన్ వచ్చి వెళ్లినట్లు పేర్కొన్నారు.
నీలోఫర్‌లో 30 రోజులపాటు చికిత్స
ఈ నెల 21న ఉదయం 6 గంటల ప్రాంతంలో చిన్నారి కదలడం లేదని గుర్తించిన మౌనిక.. ఉదయం ఏడున్నర గంటలకు జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు ఎస్పీ తెలిపారు. మొదట పోస్టుమార్టం కో సం తల్లిదండ్రులు గణేష్, మౌనిక నిరాకరించి సంతకాలు చేసినట్లు కూడా గుర్తించా మన్నారు. ఆ తర్వాతే అనుమానాస్పద మృ తి కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం శిశువుకు ఎలాంటి గాయాలు లేవని గుర్తించామని ఎస్పీ వెల్లడించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు కోసం వేచి ఉన్నట్లు పేర్కొన్నారు. 31 వారాల్లో జన్మించిన శిశువు.. 1.44 కేజీల బరువు మాత్రమే ఉందని, రెస్పిరేటర్ డిస్ట్రబ్‌తో బాధపడుతూ వెంటిలేషన్ కోసం హై దరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో 30 రోజులపాటు చికిత్స పొందినట్లు గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. నియో సెట్టర్ హైప ర్ ఢిలిరూబీనియా, లేట్ హాస్పిటల్ నియోనేటర్ సస్పెస్( ఫ్లెక్సీయోల్లా న్యూమోనియా ) వంటి లక్షణాలు ఉన్నట్లు నిలోఫర్ ఆసుపత్రి ప్రకటించినట్లు తెలిపారు.
ఇదిలా ఉం డగా ఈ నెల 22న మౌనిక మరో ఫిర్యాదు చేస్తూ తనను కులం పేరుతో దూషిస్తూ, భర్త గణేష్‌ను రెడ్డి కులానికి చెందిన వారు టెంకాయల గదిలో బంధించి దాడి చేసి గాయ పరిచారని, కాపాడాలని తన బిడ్డను పాదాల వద్ద ఉంచితే సంఘం మధురెడ్డి తన్నడంతో శిశువు రెండు మీటర్ల దూరంలో పడిందని, ఆ కారణం చేత మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.
ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, తదితర కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి, మధురెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలను రి మాండ్ చేసి పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందం ద్వా రా గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో కుమ్మెర గట్టు వద్ద బలవంతంగా డబ్బులు వస్తువులు చేస్తున్నట్లు ఈ నెల 18న గణేష్ ఇచ్చిన ఫిర్యాదులో నమోదు చేయలేదన్నారు.
తన భార్యను కులం పేరుతో దూషిం చినట్లు కూడా ఫిర్యాదులో లేదన్నారు. ఈ నెల 18 గొడవ జరిగిన సమయం నుంచి శిశువు మృతి చెందే వరకు ఎక్కడ చికిత్స పొందినట్లుగా ఆధారాలు లేవన్నారు. మౌని క గర్భిణిగా ఉన్న సమయంలోనే తన భర్త తనపై దాడి జరిపినట్లు ఆస్పత్రి రికార్డుల్లో నమోదయి ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన అనంతరం బాధితులకు పరిహారం ఇచ్చే క్రమంలోనూ అధికారుల సహాయంతో ఎస్సీ సర్టిఫికెట్ ఆధారాలు అడిగినా వారి నుంచి స్పందన రాలేదన్నారు.




