21 June, 2026 | 1:40 AM

పాక్, ఖతార్‌లో పత్రికా స్వేచ్ఛ లేదు

21-06-2026 12:05 AM

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలు 

వాషింగ్టన్, జూన్ 20: పాకిస్థాన్, ఖతార్ లాంటి దేశాల్లో పత్రికా స్వేచ్ఛ లేదని, రాజ్యాంగ రక్షణలు లేవని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. 14 సూత్రాల ఒప్పందం ప్రకారం ఇరాన్ తన సంపన్న యురేనియం నిల్వలను తగ్గించుకోవడానికి అంగీకరించిందని జెడి వాన్స్ స్పష్టం చేశారు. గత ఒబామా ప్రభుత్వ ఒప్పందం కంటే తమ ఒప్పందం చాలా మెరుగైనదని, దీనివల్ల ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో పాకిస్తాన్ 180 దేశాలకు గాను 153వ స్థానంలో ఉందన్నారు. అక్కడి వ్యవస్థల్లో భావప్రకటన స్వేచ్ఛ రోజురోజుకూ క్షీణిస్తోందని చెప్పారు. వాన్స్ వ్యాఖ్యలతో అమెరికా మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో తామే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంటున్న పాకిస్థాన్‌కు తీవ్ర అవమానం ఎదురైనట్లయ్యింది. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అమెరికాఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరుగుతుందని పాక్ ప్రధాని ప్రకటించి తన పర్యటన కూడా ఖరారు చేసుకున్నారు. స్విట్జర్లాండ్‌లో ఎలాంటి ఒప్పందం జరగదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించడంతో షరీఫ్ తన పర్యటన రద్దు చేసుకున్నాడు.