మంచినీటి ఎద్దడి నివారణకు నిధుల కొరత లేదు
జీపీఓలపై మంత్రి సీరియస్
ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ ని బదిలీ చేస్తున్న
వీటి ఎద్దడి నివారణకు అరకోటి నిధులు
మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
భీమదేవరపల్లి, మార్చి 10 (విజయక్రాంతి): రానున్న వేసవికాలంలో మంచినీటి ఎద్దడి నివారణకు నిధుల కొరత లేదని, ఎన్ని నిధులు అయినా ఖర్చు చేసి మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎల్కతుర్తి గ్రామంలో జరిగిన సమావేశంలో సమావేశానికి రాకుండా డుమ్మా కొట్టిన జిపిఓలపై మంత్రి సీరియస్ అయ్యారు. భీమదేవరపల్లి కమలాపూర్ మండల కేంద్రాల్లో ఆర్డబ్ల్యూఎస్ ఏఈగా రెండు మండలాలలో పనిచేస్తున్న ఏఈ భీమదేవరపల్లిలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేవలం కమలాపూర్ లో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
భీమదేవరపల్లి మండలంలో మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని సర్పంచులు బొల్లంపల్లి సుకుమార్, కేతిరి లక్ష్మారెడ్డి, జాలి ప్రమోద్ రెడ్డి కల్పన తిరుపతిరెడ్డి ,నేతుల మోహన్, మాచర్ల కుమారస్వామి, సిద్ధమల్ల రమాదేవి, శిఖ ప్రదీప్, వంగ తిరుమల సురేష్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి చేశారు. మండలంలోని 25 గ్రామాలకు అరకోటి కి పైగా నిధులతో అన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంకులు పైపులైన్ల నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు మండలంలోని సర్పంచులు కార్యదర్శులు ఉప సర్పంచులు పాల్గొన్నారు.




