చిన్నతనం నుంచే సేవా భావాన్ని అలవర్చుకోవాలి
కేసముద్రం, మార్చి 10 (విజయక్రాంతి): చదువుతో పాటు స్నేహభావాన్ని చిన్నతనం ఉండే విద్యార్థులు పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన సమాజానికి దోహదపడుతుందని సామాజికవేత్త చిర్రా యాకాంతం గౌడ్ అన్నారు.
కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో నిర్వహి స్తున్న ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరంలో యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ గుగులోత్ రమేష్ బాబు ఆ ధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యాకాంతం గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు తమ విద్యను అభివృద్ధి చేసుకుంటూ స్వశక్తితో తన ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, తల్లిదండ్రులను పూజిస్తూ, గురువులను గౌరవించాలని, చదువుతో పాటు సమాజ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను తెలుసుకొని సన్మార్గంలో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.
గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివా ళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మైసయ్య, ప్రవీణ్, రమాదేవి, రాజు, యాదగిరి, రవి, సలీం, మంజుల, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




