12-12-2025 11:24:27 AM
జన్నారం, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలంలో రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మొదటి విడత ఎన్నికలు నిర్వహించారు. మండలంలో 29 గ్రామ పంచాయతీలుండగా లింగయ్యపల్లి, లోతెర్రె జీపీలకు ఒక్కటొక్కటే నామినేషన్ లు దాఖలు కావడంతో ఈ రెండు జీపీలు ఏకగ్రీవంగా అధికారులు ప్రకటించారు. మిగిలిన 27 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా 98 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మండలంలో 43,306 (పురుషులు 21,127, మహిళలు 22,177, ఇతరులు 2) ఓట్లు ఉండగా ఉదయం తొమ్మిది గంటల వరకు 6,058 (14%), 11 గంటల వరకు 19,568 (45%), ఒంటి గంట వరకు 32,584 (75.24%), ఒంటి గంట అనంతరం క్యూలో నిలబడిన వారు ఓటు హక్కును వినియోగించిన అనంతరం పోలింగ్ 33,257 (76.80%)కి చేరుకుంది. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో 15,245 (72.16%) పురుషులుండగా, 18,012 (81.22%) మహిళలు ఉన్నారు.
విజయం సాధించిన సర్పంచులు వీరే...
జన్నారంలో 29 గ్రామ పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కాగా 27 జీపీలకు 98 మంది సర్పంచు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో లింగయ్యపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కొత్తపల్లి వనిత, లోతొర్రె సర్పంచిగా బోడ శంకర్ లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా బాదంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సామర్ల లక్ష్మీరాజం (బీజేపీ) విజయం సాధించగా బంగారుతండాలో భూక్య నిర్మల బాయ్ (కాంగ్రెస్), చింతగూడలో సుతారి సుమలత (బీఆర్ఎస్), చింతపల్లిలో పంజాల సురేష్ గౌడ్ (ఇండిపెండెంట్), ధర్మారంలో ఆత్రం గోదావరి (ఇండిపెండెంట్),
దేవునిగూడలో రామ్టెంకి రాజేష్ (ఇండిపెండెంట్), హాస్టల్ తాండలో జయశ్రీ (బీఆర్ఎస్), ఇందన్ పల్లిలో గుగులోత్ శంకర్ (బీజేపీ), జన్నారంలో అజ్మీరా కళావతి (కాంగ్రెస్), కమాన్ పల్లిలో పేరం శ్రీనివాస్ (బిఆర్ఎస్), కవ్వాల్ లో సక్రూ నాయక్ (కాంగ్రెస్), కిష్టాపూర్ లో వాసాల నరేష్ (ఇండిపెండెంట్), కొత్తపేటలో చౌహాన్ దినేష్ నాయక్ (కాంగ్రెస్), కలమడుగులో బొంతల నాగమణి (కాంగ్రెస్), పోనకల్ లో సుష్మా (కాంగ్రెస్), మల్యాల్ లో భాగ్యలక్ష్మీ (కాంగ్రెస్), మహ్మదాబాద్ లో రాంటెంకి శంకర్ (బీఆర్ఎస్),
మొర్రిగూడ లో తాళ్ళపల్లి విజయ
(ఇండిపెండెంట్), మురిమడుగులో యాదగిరి భారతి (బీఆర్ఎస్), రేండ్లగూడలో అల్లం మాధవి (కాంగ్రెస్), రాంపూర్ లో నూతి రామయ్య (ఇండిపెండెంట్), రోటిగూడలో పెల్లి గోపాల్ (బీజేపీ), సింగరాయిపేటలో రజిత (బీఆర్ఎస్), తొమ్మిదిగుడిసెల పల్లిలో కుదిరె వెంకటి (కాంగ్రెస్), తిమ్మాపూర్ లో గుగులోత్ సంగీత(ఇండిపెండెంట్), వెంకటాపూర్ గ్రామ సర్పంచి అభ్యర్థిగా మేస్రం రాజ్ కుమార్ ( ఇండిపెండెంట్) లు గెలుపొందారు. మండలంలో 272 వార్డు సభ్యులకుగాను 111 ఏకగ్రీవం కాగా రెండు నామినేషన్ లు దాఖలు కాకపోవడంతో 159 వార్డులకు ఎన్నికలు జరుగగా 498 మంది అభ్యర్థులు పోటీల్లో పాల్గొన్నారు.