12-12-2025 12:40:08 PM
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పాటిల్(Former Union Minister Shivraj Patil passes away) చకుర్కర్ శుక్రవారం మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో స్వల్ప అనారోగ్యంతో మరణించారు. శివరాజ్ పాటిల్ వయసు 90 సంవత్సరాలు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం, ఆయన లోక్‌సభ స్పీకర్, అనేక మంత్రిత్వ శాఖలతో సహా కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులను నిర్వహించారు.
1935లో లాతూర్‌లోని చకూర్ ప్రాంతంలో జన్మించిన శివరాజ్ పాటిల్, 1991 నుండి 1996 వరకు లోక్‌సభ 10వ స్పీకర్‌గా నియమితులైనప్పుడు, పార్లమెంటరీ కార్యకలాపాలను ప్రసారం చేయడానికి, సమాచార వ్యాప్తికి, పార్లమెంట్ లైబ్రరీ భవనం నిర్మాణానికి సాంకేతికతను ప్రవేశపెట్టడంలో ప్రసిద్ధి చెందారు. 2004-2008 వరకు కేంద్ర హోంమంత్రిగా విధులు నిర్వహించారు. 2010-15 మధ్య పంజాబ్ గవర్నర్ గా ఆయన సేవలందించారు. 1980-2004 వరకు శివరాజ్ పాటిల్ లోక్ సభ ఎంపీగా ఉన్నారు. వరుసగా ఏడు సార్లు లోక్ సభ ఎంపీగా శిరాజ్ పాటిల్ విజయం సాధించారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.