calender_icon.png 12 December, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెన్సీ నోట్లను కాదు..పేదోడిని గెలిపించండి.

12-12-2025 12:57:00 PM

చిట్యాల కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కట్కూరి పద్మ నరేందర్.

చిట్యాల(విజయక్రాంతి): కరెన్సీ నోట్ల కట్టలను కాదు పేదోడిని,అధికార పార్టీని గెలిపిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని చిట్యాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కట్కూరి పద్మ నరేందర్ అన్నారు.శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కట్కూరి పద్మా నరేందర్ ప్రచారంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, యువకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కట్కూరి పద్మ నరేందర్ మాట్లాడుతూ రామాలయం నిర్మాణం గురించి ప్రతిపక్షానికి చెందిన కొందరు రాజకీయాలు చేస్తున్నారు.

కానీ పేద కుటుంబానికి చెందిన మేము గతంలోనే రామాలయ కమిటీకి పదివేల రూపాయలు  ఇచ్చామని తెలిపారు. అధికార పార్టీని ఆశీర్వదించి గెలిపిస్తే మీ ముందు ఒక సేవకుడిలా పని చేస్తూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు.సంపాదన కోసమే రాజకీయంలోకి రాలేదని అభివృద్ధి మాత్రమే ఏజెండాగా మీ ముందుకు వచ్చానని తెలిపారు. ఆశీర్వదిస్తే మీ ఇంటి ఆడపడుచుగా, చెల్లిగా, అక్కగా సేవలందిస్తానని తెలిపారు. ఒక్కసారి మాకు సర్పంచ్ గా అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని తెలియజేశారు. ప్రజలంతా ఎదుటి వ్యక్తి నోట్ల కట్టలను తీసుకుని పేదోడికి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.